09-04-2025 12:43:14 AM
ఎమ్మెల్యే అనిల్ జాదవ్
నేరడిగొండ, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): గత రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి బోథ్ నియోజకవర్గ వ్యాప్తంగా పం ట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభు త్వాన్ని కోరారు. మంగళవారం నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలో పంట నష్ట పోయిన రైతుల చేలను ఎమ్మెల్యే పరిశీలించారు. జొన్న పంట పూర్తిగా నేలమట్టం అవడం గమనించారు. తక్షణమే సంబంధిత అధికారులు పంట నష్టం జరిగిన చేలల్లో పర్యటించి సర్వే జరిపి పంట నష్ట నివేదికను ప్రభుత్వానికి అందించాలని సూచించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు ఉన్నారు.