04-03-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 3 (విజయక్రాంతి) : పదవ తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి అన్నారు. సోమవారం గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిడి మాట్లాడు తూ విద్యార్థుల్లో భయాన్ని తొలగించి ఒత్తిడి కి గురికాకుండా పరీక్షల పట్ల అవగాహన కల్పించాలన్నారు.
సహజంగా విద్యార్థుల్లో పరీక్షలు అంటే భయం ఉంటుందని దానిని తొలగించే దిశగా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు. జిల్లాలోని 36 ఆశ్రమ పాఠశాల నుండి 1255 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు.
వంద ఉత్తీర్ణత సాధించేందుకు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిసిడిఓ శకుంతల, ఏటిడివో చిరంజీవి సెంటర్ ఇన్చార్జిలు కృష్ణారావు, రవీందర్ ,రిసోర్స్ పర్సన్ రాథోడ్ రవీందర్, భరత్, ఖలీల్ ,నారాయణమూర్తి, జాగేష్, అరుణాదేవి , జంగు పాల్గొన్నారు.