calender_icon.png 7 March, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నైపుణ్యం పెంపొందించుకోవాలి

07-03-2025 12:00:00 AM

డీఆర్‌డీవో సాయాగౌడ్

నిజామాబాద్ మార్చి 6: (విజయక్రాంతి): స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కు యూనిఫారం కుట్టడం లో నైపుణ్యం పెంచుకోవాలని ,నాణ్యమైన దుస్తులు సకాలంలో  పంపిణీ చేయాలని కోరారు డి ఆర్ డి ఓ సాయ గౌడ్ కోరారు.

స్థానిక కలెక్టర్ సమీకృత కార్యాలయం లో గల సమావేశ మందిరంలో అన్ని మండల సమాఖ్య లకు చెందిన మాస్టర్ ట్రెయినర్స్ కు జరిగిన టైలారింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

మహిళలకు టైలరింగ్ లో బల్క్ కట్టింగు,ఖాజా,బటన్ కుట్టడం లో శిక్షణ ఇస్తున్నామని ఈ శిక్షణ కార్యక్రమాన్ని  సద్వినియోగం చేసుకోవాలని సాయ గౌడ్ కోరారు. ఈ శిక్షణ ను మాస్టర్ ట్రైనర్ లు రెండు రోజుల పాటు ఇవ్వనున్నాట్టు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో  డీఆర్‌డీఓ సాయగాౌడ్,  రవీందర్ డీపీయం సాయిలు, ఏపీఎం రాజేందర్,శిక్షకులు మాధవి,లత,పద్మ,సుజాత,మంజుల అన్ని మండల లా నుండి మహిళా టైలర్ లు పాల్గొన్నారు.