- జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్
మున్సిపాల్టీలో వివిధ అభివృద్ధి పనుల పరిశీలన
గద్వాల, జనవరి 8 ( విజయక్రాంతి ): మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అధికారులకు ఆదేశించారు. బుధవారం అయిజ మున్సి పాల్టీలో వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సి పాలిటీలోని పెండింగ్ పనులను నాణ్యతతో కూడిన విధంగా పూర్తి చేయాలని ఆదేశించా రు.
పెద్దవాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను పరిశీలించి,అంబేద్కర్ చౌక్ నుండి ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్-వెజ్ మార్కెట్‌కి నేరు గా వెళ్లే రహదారిని మూసివేసి ట్రాఫిక్ కోసం డివైడర్ ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. ప్రజలకు రాకపోకలో ఇబ్బందులు కలగకుం డా వీలైనంత త్వరగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు.
ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్-వెజ్ మార్కెట్ పనుల పురోగతిని సమీక్షించి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వర గా పూర్తిచేయాలని అధికారులకు సూచించా రు. మార్కెట్‌కి అనుబంధంగా ఉండే ప్రవేశ రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. గద్వాల నుంచి ఐజా వరకు రోడ్డు మరమ్మ తులు పరిశీలించి, రోడ్డు పనుల నాణ్యతను పరిశీలించారు.
గద్వాల, ఐజా మునిసిపా లిటీలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న రహదారలు, సీసీ రోడ్డు పనుల ప్రస్తుత స్థితిని చూసి,ఇంకా పెండింగ్‌లో ఉన్న పనుల ను త్వరగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు ఆదేశించారు. కాంట్రాక్టర్లు పనులను సమాంతరంగా వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు. గద్వాల,ఐజా ప్రవే శదారుల వద్ద ఉన్న రహదారి పనులను ప్రాధాన్యంగా తీసుకుని వెంటనే పూర్తిచేయా లని సూచించారు.
ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మునిప్సల్ చైర్మన్ చిన్న దేవన్న, మున్సిపల్ కమీషనర్ రాజయ్య, ఆర్‌అండ్‌బీ ఈఈ ప్రగతి, కిరణ్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.