* పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 24 (విజయక్రాంతి): వినియోగదారుల రక్షణ చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరిం చుకుని జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్‌లో మంగళ వా రం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ విధానం, వర్చువల్ విచారణల ద్వారా వినియోగదారులకు సత్వర న్యాయం అందేలా సంఘాలు పనిచేయాలని సూచించారు. ఆహార పదార్థాలు, నగలు, ఇతర ఏ వస్తువునైనా కొనుగోలు చేసేటప్పుడు ధర, నాణ్యతాప్రమాణాలు తెలుసుకొని కొనుగోలు చేయాలని వినియోగదారులకు సూచించారు. అన్యాయం జరిగినప్పుడు వినియోగదారుల ఫోరంకు దరఖాస్తు పెట్టి న్యాయపరంగా నష్టపరిహారం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల చట్టాలపై ఉపన్యాసం ఇచ్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
తూనికలు, కొలతల శాఖ ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్‌ను చౌహాన్ సందర్శించారు. డీసీఎస్‌ఓ రమేష్, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ అరుణ్ సాయి, తూనికలు, కొలతలు శాఖ అధికారి శివానంద్, అరోరా కళాశాల ప్రొ.అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.