calender_icon.png 16 January, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూల చికిత్స అవసరం

09-10-2024 12:00:00 AM

ఏ సమస్యకైనా మూలం ‘కొందరు మనుషులు’ అనుకుంటే పొరపాటు. మనుషులు కేవలం పాత్రధారులు మాత్రమే. అసలు మూల కారణం వేరే వుంటుంది. సామాజిక స్పృహ, సరైన అవగాహన, జ్ఞానశుద్ధి లేనివాళ్లు ఏర్పరచుకునే అపోహ ఇది. సమాజంలోని పేదరికం, అసమానతలు, వివక్ష,  నిరక్షరాస్యత, నిరుద్యోగం, నిరాశలు, నిస్పృహలు, అవినీతి, అక్రమాలు వంటివి తొలగించకుండా ‘మావోయిజాన్ని’ నిర్మూలిస్తామని అకోవడం భ్రమ కాక ఏమవుతుంది? తుపాకులతో, హింసతో ఏ పనీ సానుకూలం కాదు. కానీ, ఈ ప్రజాస్వామ్య యుగంలో ప్రజల సమస్యలు ఎంత ఎక్కువగా పరిష్కారమైతే అంతగా సంక్షోభాలు తలెత్తకుండా ఉండాలి. అప్పుడే నక్సల్స్ అనేవారు పుట్టుకు రాకుండా ఉంటారు.

 డి. సాత్విక్, కరీంనగర్