దేశంలోని ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు మరీ గాలిలో మేడలవుతున్నాయి. గత ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే భారతదేశంలోని టాప్ ఐటీ కంపెనీల్లో మొత్తం ౬౯ వేల మందిని తొలగించినట్టు తాజాగా వార్తలు వచ్చాయి. ఇది అత్యంత బాధాకరం. టాటా కన్సల్టెన్సీ, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్, టెక్ మహీంద్ర వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలే వేలాది మందిని ఊడబెరుకుతుంటే, ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో యువత కొట్టుమిట్టాడుతున్నారు. కొంతలో కొంత ఊరటనిచ్చే విషయమేమిటంటే, సీనియర్లను తొలగించుకొని మళ్లీ ఫ్రెషర్స్‌ను తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది.
ప్రవీణ్, గచ్చిబౌలి, హైదరాబాద్