calender_icon.png 3 April, 2025 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

03-04-2025 12:17:14 AM

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి) సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహనా కలిగి ఉండాలని సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ గిరి కుమార్ కల్కోట అన్నారు. బుధవారం సైబర్ జాగృత దివాస్ కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా వెల్డండ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన అవగాహనా కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.

స్మార్ట్ ఫోన్ ఆధారంగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా సైబర్ నేరగాళ్లు వివిధ లింకుల ద్వారా బ్యాంకులోని నగదు లూటీ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి నెల మొదటి బుధవారం రోజున సైబర్ జాగ్రూక్త దివస్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ సీజన్ నేపథ్యంలో బెట్టింగ్ అప్స్,ఐపీఎల్ టికెట్స్ ఫ్రాడ్ జరుగుతోందని వాటిప ట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వారి వెంట సిఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్త్స్ర కురుమూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు.