calender_icon.png 11 March, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ చెల్లింపులపై అవగాహన అవసరం

11-03-2025 12:53:27 AM

మందమర్రి మార్చి 10 ( విజయ క్రాంతి): డిజిటల్ లావాదేవీలపై ప్రతి ఒక్కరూ. అవగాహన కలిగి ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్  ఇండియా, హైదరాబాద్ శాఖ ప్రతినిధులు బిఎల్  రాయుడు, ఎం.హరీష్ లు ఆన్నారు. మండలం లోని చిర్రకుంటలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిజిటల్ చెల్లింపుల వలన ప్రయోజనా లు, నగదు రహిత చెల్లింపులు జరిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్బంగా  తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ శివకుమార్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ చెల్లింపులు జరిపే దేశాల్లో భారతదేశం ముందుందని,ఇందుకు పొదుపు సంఘాల మహిళలు కూడా కారణమని తెలిపారు.

వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి మాట్లాడుతూ, నగదు రహిత లావాదేవీల ద్వారా డిజిటల్ యుగంలో నూతన అధ్యాయం మొదలైందని, ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు  వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లో అమ్మెటప్పుడు, విత్తనాలు,ఎరువులు తదితర అవసరాలకు డిజిటల్ విధానాల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారని అన్నారు.

తెలిపారు.ఇందిరా క్రాంతి పథం సిసి చారి మాట్లాడుతూ డిజిటల్ లావాదేవీలు జరిపేటప్పుడు పాస్ వర్డ్ ల విషయంలో గోప్యత పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీజీబి యపల్ శాఖ ఫీల్ ఆఫీసర్ రాజేష్, కాంగ్రెస్ నాయకులు గందే రామ్ చందర్, రైతులు ,మహిళలు పాల్గొన్నారు.