calender_icon.png 9 April, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంట్రాక్టర్లు కావలెను?

02-04-2025 12:00:00 AM

అభివృద్ధి పనులు చేసేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు

టార్చి వేసి వెతికిన కనిపించని కాంట్రాక్టర్లు 

నియోజక వర్గాలకు  కోట్ల రూపాయలు సిసి రోడ్లు మంజూరు 

డబ్బులు త్వరగా రావంటూ గుత్తేదారుల వెనకడుగు

బలవంతం పెట్టిన పని చేయడానికి ముందుకు రాని వైనం 

పనులు చేయించేందుకు కొత్తవారిని వెతుకుతున్న లీడర్లు

కామారెడ్డి జిల్లాలో ఎన్ ఆర్ జి ఎస్ నిధులతో చేపట్టే పనులకు కాంట్రాక్టర్ల కొరత

కామారెడ్డి /జుక్కల్, ఎప్రిల్ 1 :(విజయక్రాంతి), ప్రభుత్వం మంజూరు చేసే అభి వృద్ధి పనులు దక్కించుకునేందుకు  పోటీ పడి కాంట్రాక్టు పనులు దక్కించుకోవలసిన కాంట్రాక్టర్ నేడు పనులు చేసేందుకు జంకుతున్నారు. గత ప్రభుత్వంలో గ్రామస్థాయి నుంచి పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు రాక అప్పులు చేసి పనులు చేసిన బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో అప్పుల పాలై ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఎన్ ఆర్ జి ఎస్ నిధులను స్థానిక ఎమ్మెల్యే లు తమ నియోజకవర్గాలకు పోటీపడి కోట్ల రూపాయల పనులు చేసేందుకు మంజూరు చేయించుకున్నారు. గతంలో ఎమ్మెల్యేల చుట్టూ పనుల కోసం చక్కర్లు కొట్టిన కాంట్రాక్టర్ లు ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేలు చెప్పినా కూడా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.

దీంతో ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నా రు. గతంలో పనుల కోసం పాకులాడిన కాంట్రాక్టర్లు బిల్లుల బెంగ పట్టుకోవడంతో పనుల వైపు కన్నెత్తి చూడడం లేదు. కనీసం  మండల కేంద్రాల్లో, గ్రామాలలో సైతం పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో పనులు చేయించేందుకు కాంట్రాక్ట్ అనుభవం లేని వారికి ఎమ్మెల్యేలు, సంబంధిత శాఖ అధికారులు పనులు చేయించేందుకు కాం ట్రాక్టర్లు కావలేను అంటూ ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు సైతం అధికారులపై పనులు చేయించాలని ఒత్తిడి తెస్తున్నారు.

ఇప్పటికే గత ప్రభుత్వ హాయంలో పనిచేసిన గ్రామస్థాయి కాంట్రాక్టర్లు తాజా మాజీ సర్పంచులు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. కామారెడ్డి జిల్లాలోని మారుమూల నియోజకవర్గమైన జుక్కల్ కు స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాం తారావు సిసి రోడ్డు పనులకు  కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు  పలు సమా వేశాల్లో ఆయన పేర్కొన్నారు. ఎక్కడైతే రోడ్లు లేవు అక్కడ ఈ సిసి రోడ్లు వేయాల్సి ఉంది.

అయితే అన్ని గ్రామాలకు సిసి రోడ్డు పనులు మంజూరైనప్పటికీ గ్రామస్థాయి నాయకులు నుంచి కాంట్రాక్టర్ల వరకు పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. జిల్లాలోని కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్సువాడ జుక్కల్ నియోజకవర్గాల్లో ఎన్ ఆర్ జి ఎస్ పథకం కింద 50 కోట్ల వరకు ఒక్కొక్క నియోజకవర్గానికి నిధులు మంజూరు అయ్యాయి. పనులు చేయిద్దామనుకుంటున్నా ఎమ్మెల్యేలకు స్థానికంగా పనులు చేసేందుకు కాంట్రా క్టర్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు సైతం ముందుకు రావడం లేదు.

నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో అభివృద్ధి పనులు చేయించేందుకు సిసి రోడ్ల పనుల కు నిధులు మంజూరు చేయించగా పనులు చేపట్టేందుకు సీన్ రివర్స్ కావడంతో ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. అసలే లేటుగా వచ్చిన నిధులకు పనులు చేపడతామంటే కాంట్రాక్టర్ లు వెనుకంజ వేయడం తో అడిగిన వారికి పనులు వెంటనే ఎమ్మెల్యేలు కట్టబెడుతున్నారు. చాలా గ్రామాలలో పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు, కాంగ్రెస్ నాయకులు పనులు చేసుకోమని ఎమ్మెల్యేలు చెప్పిన పనులు చేసేందుకు ఆలోచన చేస్తున్నారు.

అప్పులు చేసి తెచ్చి సి సి రోడ్ల నిర్మాణం పనులు చేపడితే బిల్లులు వస్తావా రావా అనే సంది గ్ధంలో గ్రామస్థాయి కాంట్రాక్టర్ లు కాంగ్రెస్ నాయకులు సతమతమవుతున్నారు. గతం లో గ్రామాలలో చేపట్టిన సిసి రోడ్డు ప నులు పూర్తి అయ్యాయి కానీ వాటికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో ఎవరు కూడా ముందుకు రావడం లేదంటూ స్థానిక నా యకులు, కాంట్రాక్టర్లు చర్చించుకుంటున్నారు. కొందరికి బలవంతంగా పనులు చేయించినప్పటికీ వారు కూడా పనులు వేగవంతం చేయడం లేదని తెలుస్తుంది.

పనులు ఎక్కువ కావడంతో కాంట్రాక్టర్లు బిల్లులు రావని భయంతో ముందుకు రావడం లేద నే కారణం చెబుతున్నారు. ఎమ్మెల్యే ఒక సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలకు నాయకులకు అందరికీ త్వరగా పనులు చేస్తే త్వరగా బిల్లులు కూడా వచ్చేటట్లు చూస్తామనీ కొందరు ఎమ్మెల్యేలు తమ పార్టీ నాయకులకు, కాంట్రాక్టర్లకు హామీ ఇచ్చినప్పటికీ సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడానికి ముందుకు రాకపోవడం విడ్డూరం గా ఉంది. బిల్లులు త్వరగా రావనే కారణం ఒకటి కాగా మరో కారణం సకాలంలో ఇసుక దొరకడం లేదంటూ మరో కారణం కూడా చెబుతున్నారని తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే కొన్ని గ్రామాలు కొందరు కాంగ్రెస్ నాయకులు నిర్మాణపు పనులకు అడ్డు వస్తున్నారంటూ మరో కారణం కూడా చెబుతున్నారు. ఇది కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గంలో ఇలా జరుగుతుందని కాంట్రాక్టర్ లు, నాయకులు వా పోతున్నారు. దీంతో ‘నిధులు ఫుల్లు - కాంట్రాక్టర్లు నిల్లు‘ అన్నట్లు వ్యవహారం కొనసాగుతుంది. ఎలాగోలా మంజూరు చేయించిన సిసి రోడ్ల పనులు పూర్తయ్యే విధంగా చూడాలనే ఎమ్మెల్యేలు తపన పడుతున్నారు.

పనులు ఏ విధంగా పూర్తి చేయించి బయట పడతామొనని జిల్లాలోని ఓ ఎమ్మెల్యే విజయ క్రాంతి తో పేర్కొ నడం చూస్తుంటే పనులు చేసేందుకు కాంట్రాక్టర్ లు ముందుకు రావడం లేదనేది జగమెరిగిన సత్యం. పెద్ద కాంట్రాక్టర్ల వేటలో ఎమ్మెల్యేలు పడుతున్నారు. మరికొందరు కొత్త నాయకులను కాంట్రాక్టర్ల కోసం చూసి వారికి పనులను కట్టబెడుతున్నారు. నిధులు ఉన్న పనులు చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఎమ్మెల్యే లు ఆందోళన చెందుతు న్నారు.

వచ్చిన నిధులు పనులు పూర్తి చేయించుకుంటే భవిష్యత్తులో మరికొన్ని పనులు కోసం నిధులు ఎలా అడగాలో ఇబ్బందిగా ఉంటుందని ఆలోచనలో ఎమ్మెల్యేలు తా టా పటాయిస్తున్నారు. లేక లేక వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవడం ఎలా అంటూ పనులను ఏ విధంగానైనా పూర్తి చేయించాలని తపనతో జిల్లాలోని ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పనులు చేసేందుకు ముందుకు వచ్చిన గ్రామాలకు వారు అడిగిన అన్ని నిధులు మంజూరు చేస్తూ పనులు ప్రారంభిస్తున్నారు. పనులు చేసేందుకు ముందుకు రాని గ్రామాల కు సంబంధించిన నిధులను సైతం  పనులు చేసేందుకు ముందుకు వచ్చిన గ్రామాల్లో అధిక నిధులు కేటాయిస్తున్నారు. అసలు విషయం తెలియక కొందరు కొందరు తమ ఎమ్మెల్యే అడిగినన్ని నిధులు ఇచ్చారని సంతోషపడుతున్నారు. 

జిల్లాలోని బాన్సువాడ జుక్కల్ ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి తోట లక్ష్మీకాంతరావు మదన్ మోహన్ రావు కాటిపల్లి వెంకట రమణారెడ్డిలు ఏ విధంగా నెట్టుకోస్తారో అనేది వేచి చూడాల్సిందే మరి.