calender_icon.png 16 March, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతి భద్రతలకై అవసరమైన చర్యలు తీసుకోవాలి

15-03-2025 10:29:11 PM

పూర్తి సహకారం ఉంటుంది..

అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ.. 

నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పోతరాజు సాయి చైతన్యను శనివారం జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ నిజామాబాద్ జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉంచేందుకు శాఖపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సిపికి సూచించారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న గంజాయి, డ్రగ్స్ మాదక ద్రవ్యలపైన పోలీస్ శాఖ వారు ప్రభుత్వ కళాశాలలతో పాటు ప్రైవేట్ కళాశాలలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి ఏ ఒక్క విద్యార్థి కూడా మత్తు బందుకు అలవాటు పడి ఒక డ్రగ్ మాఫియా చేతిలో మోసపోకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పోలీస్ కమిషనర్ కు కోరారు. 

ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్ అర్బన్ కేంద్రంలో వరుసగా దొంగతనాలు చైన్స్ స్నాచింగ్లు, ద్విచక్రవాహనాలు, దొంగతనాలు పోలీస్ శాఖ అధికారులు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసుకోవాలని ఆయన అన్నారు. ట్రాఫిక్ సమస్య, ఫుట్ పాత్ కబ్జాలు, అక్రమ భూ కబ్జాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అక్రమ కబ్జాదారులపై ఆయన కోరారు. ఈ విధంగా చర్యలు చేపడితే పోలీస్ శాఖ అధికారులు సామాన్య ప్రజలకు అండగా నిలిచిన వారు అవుతారని ఆయన అన్నారు.

లా అండ్ ఆర్డర్ అంశంలో తమకు నా వంతు పూర్తి సహకారం ఉంటుందని ధన్పాల్ సూర్యనారాయణ సీపీకి హామీ ఇచ్చారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య మాట్లాడుతూ... లా అండ్ ఆర్డర్ శాంతి శాంతియుత వాతావరణాన్ని అందించడానికి తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటూ... అవసరమైతే మీ సహకారాన్ని కూడా తీసుకుంటానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తకు జిల్లా పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య భరోసా ఇచ్చారు.