22-02-2025 12:00:00 AM
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి, ఫిబ్రవరి 21 (విజయ క్రాంతి): ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి జాతర ఉత్సవాలకు భారీ గా ఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులకు ఆదేశించారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన జాతర ఉత్సవాల పై సమీక్ష నిర్వహించారు. శుక్రవారం విజయ క్రాంతి దినపత్రికలో కేతకీ పాలకవర్గం నియమ కానికి రాజకీయ గ్రహణం అనే వార్త ప్రచురితం కావడం జరిగింది.
దీంతో కలెక్టర్ క్రాంతి వల్లూరు దేవాలయం అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతరలో ప్లాస్టిక్ వాడకం పై పూర్తిగా నిషేధించాలని అదేశాలు జారీ చేశారు. జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జాతరలో శానిటేషన్ సమస్య తలెత్తకుండా చూడాల న్నారు.
తాగునీటి వసతి, మరుగుదొడ్ల ఏర్పాటు, జాతర పరిసరాల పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు నడిపించాలని ,భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాటు చేయాలన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నాలుగు రోజులపాటు జరిగే ఝరాసంఘం కేతకి సంగమేశ్వర స్వామి జాతరకు అవసర మైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు.
జాతరలో చేస్తున్న ఏర్పాట్లను అధికారులు కలెక్టర్ వివరించారు. జాతరకు సుమారు రెండు లక్షల పైచిలుకు భక్తులు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రల నుండి వచ్చే అవకాశం ఉన్నందున భక్తుల రద్దీకి అనుగుణంగా జాతర ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ అధికా రులకు ఆదేశించారు. జాతర సందర్భంగా ఆర్టీసీ అధికారులు ఆయారూట్లలో ప్రత్యేక బస్సు సర్వీస్‌లో నడపాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆర్‌అండ్ బి పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో జాతర కు ప్రజలు వచ్చే మార్గాలలో రోడ్ల మరమ్మత్తు పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగ కుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
గ్రామీణ మంచినీటి సరఫరా మిషన్ భగీరథ ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తులకు తాగునీటి వసతి ఏర్పాట్లు, పంచాయతీ రాజ్ శాఖ తరుపున మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లకు అవసరమైన మరమత్తు పనులు చేపట్టడంతో పాటు తాత్కాలిక మరుగు దొడ్లు సైతం ఏర్పాటు చేయాలని, రన్నింగ్ వాటర్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.
సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, డి ఆర్ ఓ పద్మజ రాణి, డి పి ఓ సాయిబాబా, ఎస్ ఇ మిషన్ భగీరథ్ రఘువీర్, ఈ ఈ పి ఆర్, జగదీష్, జహీరాబాద్ ఆర్ డి ఓ రాం రెడ్డి, టెంపుల్ ఇవో శివరుద్రప్ప, మండల ఎంపిడిఓ లు, ఎంపీఓ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.