calender_icon.png 9 January, 2025 | 7:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట్ లీక్ మాస్టర్‌మైండ్ అరెస్ట్

12-07-2024 12:53:21 AM

  1. రాకేశ్‌రంజన్‌ను పాట్నాలో పట్టుకున్న సీబీఐ
  2. పేపర్ లీక్‌తో పెద్దగా నష్టం జరగలేదు: ఎన్టీఏ
  3. అభ్యర్థులకు అన్యాయం చేయం: కేంద్రమంత్రి

న్యూఢిల్లీ, జూలై 11: నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న రాకేశ్ రంజన్ అలియాస్ రాకీని సీబీఐ గురువారం పాట్నాలో అరెస్టు చేసింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో హోటల్ నిర్వహిస్తున్న రాకీ.. నీట్ పేపర్‌ను సంపాదించి చింటు అనే వ్యక్తికి ఇచ్చాడని, అతడు దానిని ప్రింట్ తీసి విద్యార్థులకు అమ్మాడని సీబీఐ అధికారు లు తెలిపారు. రాకీని స్థానిక కోర్టులో హాజరుపరచగా, అతడికి కోర్టు 10 రోజుల సీబీఐ కస్టడీ విధించింది. ప్రశ్నపత్రాన్ని సంపాదించిన తర్వాత దానికి రాకీ కీని కూడా తయారుచేయించాడని గుర్తించారు. 

గుజరాత్‌లో పేపర్ లీక్ ఏజెంట్ల అతి తెలివి

గుజరాత్‌లో నీట్ పేపర్‌ను లీక్ చేసిన ఏజెంట్లు.. వాటితో పరీక్షలు రాయించిన విద్యార్థులను అధికారులు అనుమానించకుండా ఉండేందుకు అతి తెలివి ప్రదర్శించినట్టు తేలి ంది. గోధ్రాలోని రెండు సెంటర్లలో లీకైన పేపర్‌ను కొన్న విద్యార్థులు పరీక్షలు రాసినట్టు గుర్తించారు. అయితే, వారంతా ఒడిశా, బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. వారికి గుజరాతీ భాష రాదు. అయినా.. లీకైన పేపర్ చేతిలో ఉంది కాబట్టి సీరియల్ నంబర్లను బట్టి సమాధానాలు గుర్తించవచ్చని, అందువల్ల గుజరాతీ భాషలో పరీక్ష రాయాల ని బ్రోకర్లు విద్యార్థులకు సూచించారు. గుజరాతీ భాషను స్థానికతగా చూపితే ఎవరికీ అనుమానం రాదని ఈ ఎత్తు వేసినట్టు సీబీఐ విచారణలో తేలింది. 

దేశం మొత్తం లీక్ కాలేదు..

నీట్ యూజీ పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపాయి. పేపర్ లీక్‌లు రెండుమూడు రాష్ట్రాల్లోనే జరిగాయని, దీనివల్ల పెద్దగా ప్రభావం పడలేదని పేర్కొన్నాయి. టెలిగ్రామ్ యాప్‌లో వైరల్ అయిన నీట్ పేపర్ నకిలీదని ఎన్టీఏ తెలిపింది. నీట్ పిటిషన్లపై విచారణను కోర్టు 18వ తేదీకి వాయిదా వేసింది. నీట్ అభ్యర్థులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువా రం సమావేశమయ్యారు. ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. పరీక్షను ర ద్దుచేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులతోపాటు.. పరీక్షను రద్దుచేయొద్దని పోరాడుతున్న విద్యార్థులో ఆయన సంయుక్తం గా సమావేశం నిర్వహించారు. 30 నిమిషాలపాటు సాగిన భేటీలో రెండువర్గాల విద్యార్థులు తమ అభిప్రాయాలను తెలిపారు. కాగా, యూ జీసీ నెట్ పేపర్ లీక్ కాలేదని ఎన్టీఏ ప్రకటించింది. ఈ పేపర్ లీకైందన్న అనుమానంతో పరీక్షను వాయిదా వేసిన విషయం తెలిసిందే.