ఏపీలో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలు
విజయవాడ: కృష్ణా జిల్లా కొండపావులూరులో ఆదివారం జరిగిన ఎన్డిఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్షా(Union Home Minister Amit Shah), ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. విజయవాడ సమీపంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (National Institute of Disaster Management) దక్షిణ క్యాంపస్,నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డిఆర్ఎఫ్) 10వ బెటాలియన్ క్యాంపస్, తిరుపతి రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ను అమిత్ షా వర్చువల్ గా ప్రారంభించారు. ఎన్ ఐడీఎం ప్రాంగణంలో అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మొక్కలు నాటారు. ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో(NDRF - 20th Raising Day) భాగంగా సిబ్బంది విన్యాసాలు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ పరికరాల గ్యాలరీని అమిత్ షా, చంద్రబాబు, మంత్రులు వీక్షించారు.
కొన్నిసార్లు అమిత్ షా పనితీరు చూస్తే.. నాకు అసూయ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
దేశంలోని సమస్యల పరిష్కారానికి అమిత్ షా పట్టుదలతో కష్టపడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) పేర్కొన్నారు. శాంతిభద్రతలు కాపాడటంలో అమిత్ షా వినూత్నంగా పనిచేస్తున్నారని కొనియాడారు. కొన్ని సార్లు అమిత్ షా పనితీరు చూస్తే... నాకు అసూయ కలుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. అన్ని విషయాల్లోనూ కేంద్రహోంత్రి అమిత్ షా(Amit Shah) వినూత్నంగా ఆలోచిస్తారని తెలిపారు. ఏపీ పునర్నిర్మాణంలో వినూత్నంగా ఆలోచించాలని అమిత్ షా సూచించారని చంద్రబాబు చెప్పారు. 93 శాతం స్టెక్ రేట్(2024 Andhra Pradesh Assembly election)తో ఏపీలో విజయం సాధించామన్న సీఎం చంద్రబాబు ఏపీకి రూ. 10 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పారు.
ఎన్నికల సమయానికి ఏపీ వెంటిలేటర్ పై ఉందన్నారు. కేంద్ర ఆక్సిజన్ ఇవ్వడంతో ఏపీ వెంటిలేటర్ స్థితి నుంచి బయటపడిందని పేర్కొన్నారు. వెంటిలేటర్ నుంచి బయటపడ్డాం.. ఇంకా కోలుకోలేదని స్పష్టం చేశారు. అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇచ్చారు.. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని సీఎం పేర్కొన్నారు. కేంద్రం మార్గదర్శకంలో పోలవరం డయాఫ్రమ్(Polavaram Diaphragm) పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఏప్రిల్ 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు వివరించారు. విశాఖ ఉక్కు(Vizag Steel Plant)కు రూ. 11,440 కోట్లు ఆర్థికసాయం చేసి ప్రాణం పోశారని వ్యాఖ్యానించారు. ఇటీవల విశాఖ రైల్వేజోన్ కు ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు కేంద్రం మద్దతు ఇంకా కావాలని కోరారు. గోదావరి -బనకచర్ల ప్రాజెక్టుకు కంద్రం మద్దతు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కోరారు.