హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (విజయక్రాంతి): గోవా, హైదరాబాద్‌కు వస్తున్న వాస్కోడిగామ రైల్లో సోమవారం ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఎన్డీపీ మద్యాన్ని పట్టుకున్నారు. షాద్‌నగర్ నుంచి సికింద్రా వరకు నిర్వహించిన తనిఖీల్లో పలువురు వ్యక్తులు గోవా నుంచి తీసుకువస్తున్న 82 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.2లక్షలు ఉంటుందని తెలిపారు.