- హాజరైన అమిత్ షా, కూటమి నేతలు
- సుపరిపాలన, రాజకీయాలపై చర్చ?
న్యూఢిల్లీ, డిసెంబర్ 25: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి సం దర్భంగా బుధవారం ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, జేడీ నేత, కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్, అప్నాదళ్(ఎస్) అధ్యక్షురాలు, కేంద్రమంత్రి అనుప్రి యా పటేల్, జేడీఎస్ నేత, కేంద్రమంత్రి కుమారస్వామి, బీహార్ హిందుస్థానీ అవా మ్ మోర్చా(ఎస్) నాయకుడు, కేంద్రమంత్రి జితన్‌రామ్ మాంఝీ, రాష్ట్రీయ లోక్‌మోర్చా(ఆర్‌ఎల్‌ఎం) అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా హ, రాజ్యసభ ఎంపీ, భారత ధర్మ జనసేన అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి సంబంధించిన ఎజెండాను అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ సుపరిపాలన, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు విశ్వస నీయ వర్గాలు తెలిపాయి. వాజ్‌పేయి ప్రభుత్వంలో సుపరిపాలనపై ప్రత్యేక దృష్టి సారిం చారు. తొలి సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా పూర్తికాలం నడిపించిన సందర్భంగా వాజ్‌పేయి జయంతి రోజున కూటమి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. జమిలి ఎన్నికలకు కూటమి నేతలు ఓకే చెప్పి న నేపథ్యంలో ఎన్డీయే సమావేశం జరిగింది.