calender_icon.png 24 November, 2024 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపఎన్నికల్లో ఎన్డీయేదే హవా

24-11-2024 01:22:07 AM

  1. 15 రాష్ట్రాల్లో 2 లోక్‌సభ, 48 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు
  2. సగానికిపైగా స్థానాలు ఎన్డీయే వశం

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు 15 రాష్ట్రాల్లోని 2 పార్లమెంట్ స్థానాలు, 48 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ అసెంబ్లీ స్థానాల్లో సగం వరకు స్థానాల్లో బీజేపీ దాని కూటమి పార్టీలు విజయం సాధించాయి. ఈ ఎన్నికల్లో జార్ఖండ్ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమికి కొత్త జోష్‌ను ఇచ్చాయి. 

* అస్సాంలో ఐదు స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా ఐదు స్థానాలకు ఎన్డీయే కూటమి దక్కించుకుంది. ఇక్కడ ఇండియా కూటమి పెద్దగా ప్రభావం చూపలేదు. 

* బీహార్‌లో ఉప ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాలను కూడా ఎన్డీయేనే గెలుచుకోవడం గమనార్హం. వేర్వేరు పార్టీల నాయకులు గెలిచినా వారు ఎన్డీయే కూటమికే చెందిన వారు. 

* చత్తీస్‌గఢ్‌లో ఉపఎన్నిక స్థానాన్ని బీజేపీ పార్టీనే కైవసం చేసుకుంది. 

* కర్ణాటకలో మూడు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 

* కేరళలో ఉప ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లో కాంగ్రెస్, సీపీఎం విజయం సాధించాయి. 

* మధ్యప్రదేశ్‌లో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ ఒక స్థానంలో, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించాయి. 

* మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ విజయం సాధించింది.

* పంజాబ్ రాష్ట్రంలో నాలుగింట మూడు చోట్ల ఆప్, ఓ చోట కాంగ్రెస్ గెలుపొందాయి.

* రాజస్థాన్‌లో ఏడు స్థానాల్లో ఉప ఎన్నికల ఫలితాలు వెలువడగా.. ఐదింట బీజేపీ, ఒకటి కాంగ్రెస్, మరో చోట ప్రాంతీయ పార్టీ గెలుపుబావుటా ఎగరేశాయి.

* సిక్కింలో రెండు స్థానాల్లో కూడా సిక్కిం క్రాంతికారీ మోర్చానే గెలిచింది. 

* ఉత్తర్‌ప్రదేశ్‌లో 9 స్థానాల్లో ఉప ఎన్నికల ఫలితాలు వెలువడగా.. బీజేపీ ఆరు, ఎస్పీ రెండు, ఆర్‌ఎల్‌డీ ఓ సీటును దక్కించుకున్నాయి. 

* ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా.. అక్కడ బీజేపీనే విజయం వరించింది. 

* పశ్చిమబెంగాల్‌లో ఆరింటికి ఆరు స్థానాలను అధికార తృణమూల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 

* మహాయుతిని అసెంబ్లీ ఎన్నికల్లో ఆశీర్వదించిన ప్రజలు.. లోక్‌సభ పోరులో మాత్రం విశ్వసించలేదు. మహారాష్ట్రలోని నాందేడ్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చవాన్ రవీంద్ర వసంత్ రావు కేవలం 1457 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం దక్కించుకున్నారు.