భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని స్థానిక దమ్మపేట సెంటర్ లోని షాపుల్లో, ప్రజలకు స్వీట్ లు పంచిన బీజేపీ శ్రేణులు అనంతరం బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ప్రజలు భారీ విజయం అందించినందుకు వారికీ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు అని అందుకే మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఎన్ని కుట్రలు పన్నిన ఎన్నో అబద్దపు ప్రచారాలు చేసిన అవి పట్టించుకోకుండా ప్రజలు ఎన్డీయే కూటమినే గెలిపించారని అన్నారు.
మోడీ గారి నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని భవిష్యత్ లో జరిగే ఎన్నికల్లో కూడ బీజేపీ, ఎన్డీయే కూటమినే ప్రజలు ఆదరిస్తారని అన్నారు. మహారాష్ట్రలో కొన్ని పార్టీలు వల్ల పార్టీ మూల సిద్ధాంతాలు వదిలి కేవలం పదవుల కోసం ప్రాకులాడిన విధానాన్ని ప్రజలు గమనించి తగిన గుణపాఠం చెప్పినారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు గంథం ప్రసాద్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు నర్సాదాసు, ఎస్సి మోర్చ రాష్ట్ర నాయకులు కటికల రంజిత్, పట్టణ ప్రధాన కార్యదర్శి మాదారపు లక్ష్మణ్, గిరిజన మోర్చ జిల్లా కార్యదర్శి మాలోత్ ప్రశాంత్ నాయక్, మహిళ మోర్చ పట్టణ కార్యదర్శి నందిగం వెంకటరమణ, అజ్మీరా రాము, కిట్టు, పువ్వల వినయ్, విజయ్, ప్రభాకర్, సత్యం, శేఖర్, రాము తదితరులు పాల్గొన్నారు.