న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకు పోయిన ‘గో ఫస్ట్’ ఎయిర్‌లైన్స్ లిక్విడేషన్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్( ఎన్‌సీఎల్‌టీ) ఆదేశించింది. ఈ మేరకు కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌కు జ్యుడీషియల్ సభ్యుడు మహేంద్ర ఖండేల్వాల్, టెక్నికల్ మెంబర్ డాక్టర్ సంఈవ్ రంజన్‌తో కూడిన ఎన్‌సీఎల్‌టీ బెంచ్ అనుమతించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
గో ఫస్ట్‌కు రుణాలు ఇచ్చిన కంపెనీలు గత ఏడాది ఆగస్టులో దీన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించిన సంస్థల బిడ్లను తిరస్కరించాక దీని ఆస్తుల లిక్విడేట్‌కు నిర్ణయించాయి. దివాలా ప్రక్రియకు అనుమతించాలని కోరుతూ 2023 మేలో కంపెనీ ఎన్‌సీఎల్‌టీలో ఒక పిటిషన్ దాఖలు చేసింది.
అంతకు ముందు కంపెనీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతూ రెండు బిడ్లు వచ్చాయి కానీ వాటిని తిరస్కరించడం జరిగింది. రుణదాతలకు గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ మొత్తం బకాయిలు రూ. 6,521 కోట్ల మేరకు ఉన్నాయి. ఈ కంపెనీకి రుణాలు ఇచ్చిన వాటిలో సెంట్లఱ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, డ్యూషే బ్యాంక్ లాంటి వి కూడా ఉన్నాయి.
ఇప్పుడు ఎన్‌సీఎల్‌టీ లిక్విడేషన్ పిటిషన్‌కు ఆమోదం తెలియజేయడంతో తాము ఇచ్చిన మొత్తంలో కొంతయినా వస్తుందన్న ఆశలు రుణదాతల్లో కలిగేందుకు ఆస్కారం లభించింది.