calender_icon.png 9 October, 2024 | 1:46 AM

వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం

31-08-2024 12:33:14 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 30: రిలయన్స్ ఇండస్ట్రీస్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ సబ్సిడరీ వయాకామ్ 18 మీడియా అంతర్జాతీయ మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీకి చెందిన భారత్ యూనిట్ స్టార్ ఇండియాతో ప్రతిపాదించిన విలీన ప్రతిపాదనకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇరువురి సభ్యులతో కూడిన ఎన్సీఎల్టీ బెంచ్ ఉత్తర్వులు జారీచేసింది.  రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ మీడియా ఆస్తుల విలీనానికి కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆమోదం తెలిపిన రెండు రోజులకే ఎన్టీఎల్టీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిస్నీ, రిలయన్స్ మీడియా రూ.70,000 కోట్ల విలీన ఒప్పందం ద్వారా ఏర్పడే జాయింట్ వెంచర్ 120 చానళ్లను, రెండు స్ట్రీమింగ్ సర్వీసుల్ని నిర్వహిస్తుంది.