హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల్లో ఎన్‌సీఈఆర్టీ పాఠ్యాంశాలు బోధించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్ రావు, నవాత్ సురేష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో విద్యార్థుల ప్రయోజనం దృష్ట్యా నూతన విద్యావిధానాన్ని అమలు చేయాలని కోరారు. జాతీయ స్థాయి లో నిర్వహించే జేఈఈ, నీట్ పరీక్షలలో ఎన్‌సీఈఆర్టీ రూపొందించిన సిలబస్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారని తెలిపారు.