హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 22 (విజయక్రాంతి): ఎన్‌సీఈడీ ఇండియా ఆధ్వర్యంలో మూడ్రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఏపీ, తెలంగాణ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ పటాన్ ఉమర్ ఖాన్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా 32 సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్స్‌ను సమర్పించి దేశం నలుమూలలనుంచి విచ్చేసిన బధిర విద్యావేత్తలు వివిధ పరిశోధన అంశాలను చర్చించారు. బధిరుల ప్రత్యేక విద్యా విధానంలో కావాల్సిన మార్పులు, చేర్పులపై ప్రజెంటేషన్ చేశారు. కార్యక్రమంలో మిష సరస్వతీ సుందరం, శుభోదయం తదితరులు పాల్గొన్నారు.
ఈ రంగంలో 30 ఏళ్లకు పైగా సర్వీసు అందించిన వారికి లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డును అందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి, డాక్టర్ ఆనంద జ్యోతి, డీకే బాబు, శ్యాంసుందర్ ఫౌండర్ సెక్రెటరీ బాలవికాస్ తదితరులు పాల్గొన్నారు.