calender_icon.png 13 March, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30 ఏండ్ల పైబడిన వారికి ఎన్‌సీడీ పరీక్షలు

13-03-2025 02:05:40 AM

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా ఇంటింటికీ వెళ్లి, 30ఏళ్లు పైబడిన వారికి అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ కోసం ఎన్‌సీడీ పరీక్షలు నిర్వహించాలని ఆశా, ఏఎన్‌ఎమ్ కార్యక   యూపీహెచ్‌సీ బోలక్‌పూర్ వైద్యాధికారి డాక్టర్ ఎం మనోజ్ రెడ్డి సూచించారు.

జాతీయ అసంక్రమిత వ్యాధుల నివారణ, నియంత్రణ కార్యక్రమంలో భాగంగా రక్తపోటు, మధుమేహం, నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల వంటి వ్యాధులకు నిర్ధారణ పరీక్షలు పరీక్షలు చేయాలన్నారు.

ప్రస్తుత జీవన విధానంలో అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల అసంక్రమిత వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వాటిని ముందుగానే గుర్తించి, చర్యలు తీసుకుంటే ప్రాణాపాయ ముప్పు నుంచి బయటపడొచ్చొని ఈ సందర్భంగా పేర్కొన్నారు.