calender_icon.png 9 January, 2025 | 2:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించిన ఎన్‌సీడీ బృందం

08-01-2025 11:59:38 PM

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఆసంక్రమిత వ్యాధులకు అందిస్తున్న వైద్య సేవలు బేష్ అని ఎన్‌సీడీ బృందం సభ్యులు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రితో పాటు పట్టణంలోని కాళ్లకుంట కాలని, నాసర్‌పుర బస్తీ దవాఖానాలను, గజ్వేల్ పరిధిలోని ములుగు, మార్కుక్, కుకునూరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ఎర్రవల్లి, మామిడియాల, నెమటూర్ గ్రామాల్లోని ఆయుష్మన్ మందిరాలను సందర్శించి ప్రజలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఎన్‌సీడీ జాతీయ సదస్సుకు హజరైన వివిధ రాష్ట్రల అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా సిద్దిపేట జిల్లాలో పర్యటించారు.

జిల్లా కలెక్టర్ మను చౌదరి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ పల్వాన్ కుమార్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సుపరిండెంట్ డాక్టర్ శాంతిలు బృందం సభ్యులను వైద్య సేవల గురించి వివరించారు. ప్రతి రోజు నమోదు చేస్తున్న రికార్డులను వివరించారు. వ్యాధులు సంక్రమించకుండా ప్రభుత్వం చెపడుతున్న అవగాహాన కార్యక్రమాలు, వ్యాధులు సంక్రమించాక అందించే వైద్య సేవలను క్లిష్టంగా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర కుటుంబ ఆరోగ్య శాఖ కార్యదర్శి కర్నన్, ఉత్తర్‌ప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరి పార్థసారథి సేన్ శర్మ, ఛతీస్గడ్ నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ ఆరాధన పట్నానాయక్, వివిధ రాష్ట్రాల ఎన్‌సీడీ అధికారులు బృందంలో ఉన్నారు.