calender_icon.png 27 December, 2024 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంసీహెచ్ తరహాలో ఎన్‌సీడీ క్లినిక్స్

05-11-2024 01:37:35 AM

  1. టీచింగ్ హాస్పిటళ్లలో ప్రయోగాత్మకంగా అమలు
  2. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ

హైదరాబాద్, నవంబర్ ౪ (విజయక్రాంతి): ఏటా భారీగా పెరుగుతున్న నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ) నియంత్రణ, వాటి బారిన పడిన ప్రజలకు చికిత్స అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.

ప్ర జలకు ఈ వ్యాధులపై అవగాహనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సోమవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయం లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మాతాశిశు ఆరోగ్య కేంద్రాలు (ఎంసీ హెచ్) తరహాలో అన్ని టీచింంగ్ హాస్పిటల్స్‌లో ఎన్‌సీడీ క్లినిక్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ క్లినిక్స్‌లో సమగ్ర వైద్యసేవ లు, ల్యాబ్స్, మెడిసిన్ అం దుబాటులో ఉంచాలని చెప్పారు. తర్వాత జిల్లా, ఏరియా హాస్పిటల్స్‌కు ఈ ఎన్‌సీడీ క్లినిక్స్ విస్తరణ జరగాలని అధికారులకు సూచించారు. రోగాల్లో ఎన్‌సీడీ 60 శాతం దాటిందన్నారు. జీవనశైలిలో మార్పు ల వల్లే ఎన్‌సీడీ జబ్బులు వస్తున్నాయన్నా రు.

బీపీ, షుగర్, గుండె, క్యాన్సర్, శ్వాస సంబంధ, కిడ్నీ జబ్బుల బారిన పడటంతో ఆర్థికభారంతో పాటు జీవితకాలం తగ్గిపోవ డం, కుటుంబాలపై ఎంతో ప్రభా వం చూపుతుందని అన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను ప్రజ లకు మరింత చేరువ చేయాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తూ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్, డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్  పాల్గొన్నారు.