హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (విజయక్రాంతి): ఎన్‌సీసీ లిమిటెడ్‌కు నాలుగు పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా( పీఆర్‌ఎస్‌ఐ) నేషనల్ అవార్డులు అందుకున్నట్లు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏజీకే రాజు తెలిపారు. ఛత్తీస్‌గఢ్, రాయ్‌పూర్‌లో ఈ నెల 20 నుంచి 22 వరకు జరిగిన 46వ ఆల్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్‌లో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మాజీ చైర్మన్ నంద్‌కుమార్ సాయి, పీఆర్‌ఎస్‌ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అజిత్‌పాఠక్ సమక్షంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నట్లు పేర్కొన్నారు. తమ సంస్థ తరఫున కార్పొరేట్ కమ్యూనికేషన్స్ జీఎం విజయ్ కుమార్ తాటపూడి ఈ అవార్డులను స్వీకరించారని తెలిపారు. చైల్డ్‌కేర్ కోసం ఉత్తమ సీఎస్‌ఆర్‌కు మొదటి బహుమతి, పీఆర్ బ్రాండింగ్ కోసం సోషల్ మీడియాలో రెండో బహుమతి, సస్టునబిలిటీ డెవలప్‌మెంట్ రిపోర్ట్‌కు మూడో బహుమతి, వార్షిక నివేదికకు నాలుగో బహుమతి వచ్చినట్లు చెప్పారు.