calender_icon.png 21 September, 2024 | 12:47 AM

ఆదిలాబాద్‌లో ఎన్‌సీసీ క్యాడెట్ శిక్షణాకేంద్రం

20-09-2024 01:38:56 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): ఎన్‌సీసీ క్యాడెట్‌లకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ఆదిలాబాద్‌లోని పూర్వ ఎరోడ్రోమ్‌లోని ఏ1 డిఫెన్స్ ల్యాండ్‌లో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 15 కిలోమీటర్ల దూరంలోని సుంకేడి వద్ద ఉన్న పోలీస్ ఫైరింగ్ రేంజ్‌లో శిక్షణ ఇచ్చేందుకు క్యాడెట్‌లను తరలించడంలో ఇబ్బందులు తలెత్తుతుండడంతో స్థానికంగానే శిక్షణాకేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. క్యాడెట్‌లకు సజావుగా శిక్షణ ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు 32వ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్నన్ వికాస్ ఈమేరకు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.