03-04-2025 10:15:28 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల లో గురువారం 12 వ. తెలంగాణ ఎన్సిసి బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్నెంట్ కర్నల్ విష్ణు పి.నాయర్ కళాశాల ఎన్సిసి యూనిట్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. విజయ్ కుమార్, ఎన్సిసి ఏ.ఎన్.ఓ లెఫ్ట్నెంట్ డాక్టర్ ఏ.సుధాకర్ ఉన్నారు. కర్నల్ విష్ణు పి. నాయర్ ఎన్సిసి విద్యార్థులకు ఆర్మీ విషయాలపై అవగాహన కల్పించారు. ఎన్సిసి విద్యార్థుల జాతీయస్థాయిలో ప్రతిభ పాఠవాలు, ఆర్డీలలో విద్యార్థుల అసాధారణ ప్రతిభ గుర్తించిన అన్ని క్యాంప్ యూనిట్ లలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సిసి విద్యార్థులు మెరుగైన ప్రదర్శన కనపరుస్తున్నందుకు ఏ.ఎన్.ఓ డాక్టర్ ఏ. సుధాకర్ ను ప్రత్యేకంగా అభినందించారు.