calender_icon.png 24 January, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ అధికారిపై నజర్

24-01-2025 12:59:35 AM

  • పత్తా లేకుండా పోయిన ఆలయ అధికారి  
  • పట్టుకునేందుకు పోలీసుల పరుగులు
  • రెండు వారాల క్రితం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు 
  • ప్రత్యేక దృష్టి సారించిన  జిల్లా పోలీస్  బాస్ 

సిరిసిల్ల, జనవరి 23(విజయక్రాంతి):  నకిలీ సర్టిఫికెట్లతో ఆలయ అధికారిగా పదోన్నతి పొందిన వ్యక్తి కోసం పోలీసులు పట్టుకునేందుకు ప్రత్యేక నజరు సారించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏఈవో విధులు నిర్వహించిన హరికిషన్ పై రెండు వారాల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

కేసు విద్యార్హత లేకున్న నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతి పొందారని, ప్రస్తుతం యాదగిరిగుట్ట ఆలయంలో ఏఈవో గా విధులు నిర్వహిస్తున్న హరికిషన్ పై స్థానిక వేములవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు  అప్పటినుండి పరారీలో ఉన్నాడు. కాగా రెండు వారాల నుండి పరారీలో ఉన్న హరికిషన్ పోలీసులకు దొరకకపోవడం పై  స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఎంత పెద్ద కేసు అయినా జిల్లా పోలీసులు ఇట్టే సాధించే సామర్థ్యం ఉన్నప్పటికీ హరికిషన్ను పట్టుకోవడంలో జాప్యం చేయడంపై అను మానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పోలీస్  ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

హరికిషన్ దొరికితే వేములవాడ ఆలయంలో నకిలీ ధ్రువ పత్రాలతో ఎంతమంది ప్రమోషన్లు పొందారని, ఈ నకిలీ సర్టిఫికెట్ల దందా ఎక్కడి నుంచి వచ్చిందని విషయాలు బయట పడతాయి. కాబట్టి సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సీరియస్ గా తీసుకొని హరికిషన్ పట్టుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఏది ఏమైనా రాజనాలయంలో నకిలీ ధ్రువపత్రాల వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.