- జిల్లాలో క్లినిక్‌లపై అధికారుల దాడులు
- పలు క్లినిక్‌లు, మెడికల్‌షాప్‌లు సీజ్
- వరుస దాడులతో బెంబేలేత్తుతున్న ఆర్‌ఎంపీ, పీఎంపీలు
సిరిసిల్ల, జనవరి 17(విజయక్రాంతి): పల్లెల్లో, పట్టణాల్లో ఎర్రగొళి, పచ్చ గొళి, తెల్లగొళి తెలిస్తే చాలు వైద్యుడిగా అవతార మెత్తుకున్నారు. పుట్టగొడుగుల్లాగా క్లినిక్లు పుట్టుకొస్తున్నా, పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారీతిన వైద్యం చేస్తున్నారు. కొన్ని గ్రామా ల్లో ఆర్‌ఎంపీల వైద్యానికి రోగులు మత్యు వాత పడ్డ సంఘటనలు లేకపోలేదు.
మతదే హాలతో జిల్లా కేంద్రంలో దర్నా, రాస్తోరో కోలు చేసిన ఘటనలు ఉన్నాయి. కాగా ఇటీ వల రాజన్న సిరిసిజిల్లా వ్యాప్తంగా ఆర్‌ఎం పీ, పీఎంపీల క్లినిక్లలపై దాడులు నిర్వహించి, సీజ్ చేస్తున్నారు. దీంతో వైద్యం చేసి, అనుమతి లేని క్లినిక్ నిర్వహకుల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి.
గత నెలలో జిల్లా వ్యాప్తంగా వేములవాడ, సిరిసిల్ల, ముస్తాబా ద్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహి స్తున్న క్లినిక్లను సీజన్ చేయడంతో పాటు నిర్వహకులపై కేసులు నమోదు చేశాడు. ఈ దాడుల్లో మందులను స్వాధీనం చేసుకున్నా రు. రాష్ర్ట వ్యాప్తంగా 33 క్లినిక్లల తనిఖీలు చేసేందుకు బందాలను ప్రభుత్వం నియ మించింది.
దీంతో జిల్లా దాడులు నిర్వహిం చి, మూడు క్లినిక్లు సీజ్ చేయగా, ఈ యేడా ది మాసంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రజిత ఆధ్వర్యంలో ప లు గ్రామాల్లో ఉన్న క్లినిక్లు, మెడికల్ షాపు లను తనిఖీ చేసి సీజ్ చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 25 వరకు ఎలాంటి అనుమతులు లేకుండా వైద్యం చేస్తున్న క్లినిక్లను అధికా రులు సీజ్ చేశారు. ఈ దాడుల్లో లేటర్ ప్యాడ్లు, మందులు స్వాధీనం చేసుకున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్య ఆరో గ్యశాఖ అధికారులు, రెవెన్యూ, పోలీసులు సంయుక్తంగా క్లినిక్లు, మెడికల్ షాపుల్లో దాడులు చేయడంతో ఆర్‌ఎంపీ, పీఎంపీల్లో భయాందోళనలకు గురి అవుతున్నారు. ప్రజ లకు మెరుగైనా వైద్యం అందించడంతో పాటు నకిలీ వైద్యంపై నజర్ పెట్టారు.
క్లినిక్‌లోనే మెడికల్ షాప్‌లు
నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్లను ఏర్పా టు చేయడమే కాకుండా మెడికల్ షాప్లు నిర్వహిస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసిన యద్ధేచ్ఛగా పల్లెల్లో ఆర్‌ఎంపీలు వై ద్యం చేసిన పట్టంచుకోవడం లేదు. ప్రతి గ్రామంలో ముగ్గురి నుంచి ఐదుగురు వర కు ఆర్‌ఎంపీలు వైద్యం ముసుగులో దోచు కుంటున్నారు. వీరందరు మండలాల వారికి సంఘం సైతం ఏర్పాటు చేసుకోవడం విశే షం.
మెడికల్ షాపుల్లో సర్టిఫికేట్ మరో కరి ది ఉండగా, నిర్వహణ మాత్రం ఇంకో కరిది ఉంటుంది. నిబంధనల ప్రకారం ఎవరి దైతే సర్టిఫికేట్ ఉంటుందో వారే మెడికల్ షాపు నిర్వహించాల్సి ఉండగా, నిబంధనలకు విరు ద్ధంగా నిర్వహణ చేపడుతున్నారు. మరి కొందరైతే ఎలాంటి సర్టిఫికేట్లు లేకుండా నే మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు.
వైద్యం పేరిట కమీషన్లు
పల్లెల్లో ఆర్‌ఎంపీలు ఈజీగా పైనల్ సంపాదించేందుకు తెరలేపారు. రోగులు తను వద్దకు వచ్చి సమస్య చెప్పుకుంటే చాలు, ఫలానా హాస్పిటల్లో మంచి డాక్టర్ ఉన్నాడు.. నేను చెప్పుతా వెళ్లండి, మంచి వైద్యం చేస్తారు. ఆ హాస్పిటల్ నిర్వహకులు మానోళ్లే అని మాయ మాటలు చెప్పి పంపి స్తున్నారు.
అక్కడికి వెళ్లిన రోగులకు అవస రం ఉన్నా.. లేకున్నా పరీక్షల పేరిట దోచు కుంటున్నారు. దోచుకున్నాదానిలో ఆర్‌ఎం పీలకు, పీఎంలకు పంచిపెడుతున్నారు. ఇదో కొత్త రకం వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇదంతా అధికారుల ఎదుట జరిగినప్పటికి చర్యలు చేపట్టకపోవడం పలు అనుమా నాలు కలిగిస్తున్నాయి.
అనుమతులు లేకపోతే చర్యలు
రాజన్న సిరిసిల్ల జిల్లా పల్లెల్లో తెలిసి తెలియనితో రోగులకు వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా రోగుల వద్ద వైద్యం పేరిట మోసాలకు పాల్పడిన, అనుమతులు లేకుండా మెడికల్ షాపులు నిర్వహించిన చర్యలు తప్ప వు. ప్రభుత్వం ప్రతి రోగికి మెరుగైనా వైద్యం అందేలా పల్లె దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఏరియా ఆస్పత్రుల్లో మెరుగైనా వైద్యం అందిస్తాం. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం పొందాలి.
-రజిత, వైద్య, ఆరోగ్య శాఖ జిల్లా అధికారి