calender_icon.png 9 March, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నయనతారా.. ఇదేంటీ కొత్తగా!

07-03-2025 12:00:00 AM

నటి నయనతార చేసి న పనికి అందరూ నోరెళ్లబెడుతున్నారు. ‘ఆమె నయనతారేనా..? ఇదేంటీ కొత్తగా..!’ అని మాట్లాడుకుంటున్నారు. చిత్రపరిశ్రమలో సరికొత్త చర్చకు తెర తీసేంతటి పని నయన్ ఏం చేసిందనేగా మీ ధర్మ సందేహం?! తమిళ చిత్రం ‘మూకుతి అమ్మన్ 2’ గురువారం ప్రారంభమైంది. ప్రారంభోత్సవంలో సినీ పరిశ్రమ ప్రముఖులు సునీల్ నారంగ్, జగదీశ్, సీ కళ్యాణ్ అతిథులుగా పాల్గొన్నారు.

దర్శకుడు సుందర్ సీతోపాటు తారాగణం నయనతార, మీనా, ఖుష్బూ, రెజీనా సందడి చేశారు. సాధారణంగా తన సినిమా పూజ, ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండే నయనతార ఈ వేడుకలో పాల్గొన్నారు. 22 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి పూజలో పాల్గొనడం అందరికీ కొత్తగా అనిపించింది. ప్రాజెక్టుపై సంతకం చేసేటప్పుడే ప్రమోషన్స్‌కు రాననే విషయాన్ని ఆమె టీమ్‌కు చెప్పేస్తారనేది ఇండస్ట్రీ టాక్.

నయనతార లీడ్ రోల్‌లో నటించిన మూకుతి అమ్మన్ పార్ట్ 1 భారీ విజయాన్ని సాధించగా, తాజాగా రెండో భాగానికి కొబ్బరికాయ కొట్టేశారు. రూ.100 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ ఆది సంగీతం అందిస్తుండగా, గోపీ అమర్‌నాథ్ సినిమాటోగ్రాఫర్‌గా, ఫెన్నీ ఆలివర్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. డాక్టర్ ఇషారి కే గణేశ్ నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని దక్షిణాది భాషలు, హిందీలోనూ విడుదల కానుంది.