యశ్ హీరోగా, మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ రూపొందిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. ఈ ప్రాజెక్టులో నయనతార కూడా నటిస్తోందట. ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరా య్ ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు. త్వరలోనే దీని గురించి దర్శకురాలు ఒక ప్రకటన చేస్తారని వెల్లడించా రు. “ప్రస్తుతం యశ్ సినిమా షూటింగ్‌లో నేను బిజీగా ఉన్నా. ఇందులో నయనతార కూడా భాగమైంది. ప్రస్తుతం ఇంతకు మించి నేనిప్పుడే వెల్లడించకూడదు.
త్వరలోనే గీతూ మోహన్ దాస్ ఒక ప్రకటన చేస్తారు” అని అక్షయ్ తెలిపారు. ఈ చిత్రం ప్రకటించి చాలా రోజులవుతోంది కానీ ఇప్పటివరకు నటీనటుల గురించి మేకర్స్ వెల్లడించలేదు. ఒక్క అక్షయ్ విషయంలో ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇదే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ చిత్రంలో నయన్ భాగమవుతోందనడంతో ప్రస్తుతం ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.