ధనుష్ నయనతారల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తన డాక్యుమెంటరీ కోసం ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన చిత్రంలోని సన్నివేశాన్ని నయనతార వాడుకోవడం, దానికి అంగీకరించని ధనుష్ రూ.10 కోట్లు పరిహారం అడగడం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంపై నయనతార తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఈ పరిణామాలన్నీ దేశ వ్యాప్తంగా సంచలనం రేపాయి.
తాజాగా నయనతార భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి ఓ వివాహానికి హాజరయ్యారు. ఆ పెళ్లికి ధనుష్ కూడా హాజరయ్యారు. వీరిద్దరూ పక్క పక్క సోఫాల్లోనే కూర్చొన్నారు. అది చూసిన వారంతా షాక్ అయ్యారు. వీరిద్దరూ ఒకరినొకరు పలకరించుకుంటారా? అసలు వీరిద్దరూ ఎదురుపడితే ఎలా స్పందిస్తారో చూడాలని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ధనుష్ మాత్రం నయనతారను అసలు పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరి ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.