calender_icon.png 1 March, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరుస అవకాశాలతో దూసుకెళుతున్న నయన్

01-03-2025 12:00:00 AM

టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి చేసింది ముచ్చటగా మూడు సినిమాలే అయినా.. తాజాగా ఈ ముద్దుగుమ్మ వరుస అవకాశాలు కొట్టేస్తోంది. ఆమె మరెవరో కాదు.. ‘ఆయ్’, ‘క’ వంటి చిత్రాలతో మంచి హిట్ కొట్టిన నయన్ సారిక. ఇప్పటి వరకూ ఈ ముద్దుగుమ్మ తెలుగుకే పరిమితమైంది. కానీ ప్రస్తుతం అమ్మడికి పాన్ ఇండియా చిత్రాలు స్వాగతం పలికాయి.

కన్నడ హీరో గణేష్ నటిస్తున్న ‘పినాక’ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. కొరియోగ్రాఫర్ ధనుంజయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయన్ సారిక కూడా భాగమైంది. ఈ చిత్రం కానీ మంచి హిట్ కొట్టిందంటే అమ్మడి జాతకమే మారిపోయే అవకాశం ఉంది. మోహన్ లాల్ నటిస్తున్న ‘వృషభ’ చిత్రంలోనూ నయన్ సారిక నటిస్తోందంటూ టాక్ నడుస్తోంది. కానీ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏమీ రాలేదు.

నందర కిశోర్ దర్శకత్వంలో పిరియాడిక్ ఫాంటసీ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కూడా నటించి.. ఇది కూడా మంచి హిట్ కొట్టిందో అమ్మడిని పట్టుకోవడం కష్టమే. రాబోయే రోజుల్లో అమ్మడి పేరు స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరినా ఆశ్చర్యమేమీ లేదు.