calender_icon.png 7 October, 2024 | 8:58 AM

ఓట్లు రాల్చని నయాకశ్మీర్

07-10-2024 01:40:57 AM

అసెంబ్లీ పోరులో బీజేపీకి నిరాశే!

అభివృద్ధి ప్రచారాన్ని నమ్మని కశ్మీరీలు

శ్రీనగర్, అక్టోబర్ 6: జమ్ముకశ్మీర్‌లో సొంతంగానే అధికారంలోకి రావాలన్న బీజే పీ ఆశలు అడియాశలే అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శనివారం విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఇగ్జిట్‌పోల్స్‌లో ఆ పార్టీ 25 సీట్లకంటే ఎక్కువ గెలిచే అవకాశం లేదని తేల్చేశాయి.

జమ్ముకశ్మీర్‌ను ఉగ్రవాద స్థావ రం అన్న అపప్రదను తొలగించి అభివృద్ధి బాట పట్టించామని ఎన్నికల్లో బీజేపీ ఎంత ప్రచారం చేసుకొన్నా ప్రజలు ఆ పార్టీని విశ్వసించలేదని ఎగ్జిట్ పోల్స్‌ను బట్టి తెలుస్తున్న ది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి న ఆర్టికల్ 370ని రద్దుచేసిన తర్వాత నిర్వహించిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కశ్మీరీలు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) కూటమివైపు మొగ్గినట్లు తెలుస్తున్నది. 

జమ్ములో బీజేపీ పట్టు

జమ్ముకశ్మీర్‌లో రెండు భిన్న ప్రాంతాలున్నాయి. ఒకటి జమ్ము, రెండోది కశ్మీర్ లోయ. జమ్ములో 43 అసెంబ్లీ సీట్లు ఉన్నా యి. కశ్మీర్‌లో 47 ఉన్నాయి. 2014 నుంచి జమ్ములో బీజేపీ తన ఆధిపత్యాన్ని చూపుతున్నది. ఈసారి కూడా ఇక్కడే 55 సీట్ల వరకు గెలుస్తుందని అంటున్నారు. కశ్మీర్ వ్యాలీలో ఈసారి కూడా ఖాతా తెరిచే అవకాశం లేదని సమాచారం.

అయితే, ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ సహా బీజేపీ పెద్దలంతా కశ్మీర్‌లో ఎలాగైనా పట్టు సాధించాలని గట్టి పట్టుదలతో ప్రచారం చేశారు. ఆర్టికల్ 370 ని రద్దుచేసిన తర్వాతనే కశ్మీర్ లోయలో ప్రశాంతత నెలకొన్నదని మోదీ, అమిత్ షా పదేపదే చెప్పుకున్నారు. నయా కశ్మీర్‌ను ఆవిష్కరించామని ప్రకటనలు చేశారు.

తమ కు అధికారం ఇస్తే కశ్మీర్‌ను స్విట్జర్లాండ్‌లాగా మారుస్తామని హామీ ఇచ్చారు. జమ్ముకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తామని కూడా చెప్పారు. కానీ, వీరి మాటలను కశ్మీరీలు పట్టించుకోలేదని పోలింగ్ సరళిని బట్టి తెలుస్తున్నది. లోయలోని ఓటర్లంతా ఎన్సీ గ్రెస్ కూటమికే ఓట్లేసినట్లు చెప్తున్నారు.

ఈ కూటమి ప్రధానంగా 370 ఆర్టికల్ పునరుద్ధరణ గురించి హామీ ఇచ్చింది. దీనిని బీజేపీ వ్యతిరేకించింది. 370 ఆర్టికల్‌పై కశ్మీరీలకు ఇప్పటికీ బలమైన ఆకాంక్ష ఉన్నది. అదే బీజేపీని ఎన్నికల్లో దెబ్బకొట్టినట్లు చెప్తున్నారు.   

ఎవరినీ నమ్మని ఓటర్లు

జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో వాస్తవంగా అయితే 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనను అనుసరించి రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మరో 5 మంది ఎమ్మెల్యేలను నియమించవచ్చు. ఎన్నికల ఫలితాలు రాకముందే ఎల్జీ ఆ పనిచేసేశారు.

దీంతో మొత్తం 95 స్థానాలు అయ్యాయి. ఇప్పు డు ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రభు త్వం ఏర్పాటుచేయాలంటే 48 ఎమ్మెల్యేల మద్దతు కావాలి. కానీ, లీడ్‌లో ఉన్న ఎన్సీ-కాంగ్రెస్ కూటమి కూడా 45 సీట్ల వద్దనే ఆగిపోతుందని ఎగ్జిట్‌పోల్స్ చెప్తున్నాయి. అంటే హంగ్ అవకాశం ఉన్నది.