బీజాపూర్‌లో ఐఈడీ పేలుడు
బీజాపూర్, జూలై 18: భద్రతా సిబ్బంది మీద నక్స్‌లైట్లు ప్రతీకారం తీర్చుకునేందుకు స్కెచ్చేశారు. బీజాపూర్ జిల్లాలో ఐఈడీని పేల్చి నలుగురు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సిబ్బ ందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడిలో మరో నలుగురు సిబ్బంది కూడా గాయపడ్డారు. బుధవారం రాత్రి మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అధికారులు పేర్కొన్నారు. అడవుల్లో కూంబింగ్ చేసి వెనక్కు వస్తుండగా వాహనాలను ఐఈడీ ద్వారా పేల్చేశారు. బీజాపూర్ జిల్లాల సరిహద్దులో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఎస్టీఎఫ్ కానిస్టేబుల్స్ చనిపోయారు.