27-04-2025 01:09:10 AM
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ!
రాయ్‌పూర్/ చర్ల, ఏప్రిల్ 26: తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. శనివారం ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మ ధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 38 మంది మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. అయితే, అధికారులు మా త్రం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.
మావోయిస్టు అగ్రనేత హిడ్మా తోపాటు భారీ మొత్తంలో మావోయిస్టులు కర్రెగుట్టలో ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, తెలంగాణలోని ములుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న కర్రెగుట్టను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. డ్రోన్లు, హెలికాప్టర్, శాటిలైట్ వంటి సాంకేతికతను ఉపయోగిస్తూ మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కర్రెగుట్టను జల్లెడపడుతున్నాయి. గల్గాం అడవుల్లో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఐఈడీ పేలి జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆ జవానును అధికారులు బీజాపూర్‌కు తరలించారు.
హెలికాప్టర్లతో బాంబుల వర్షం!
దండకారణ్యంలో ఐదు రోజులుగా కూంబింగ్‌కు ఎండ తాకిడి ప్రధాన సమస్యగా మారినట్టు తెలుస్తోంది. ములుగు పరిధిలో ఎండ తీవ్రతకు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ క్రమంలో కూంబింగ్‌లో పాల్గొన్న భద్రతా బలగాలు డీహైడ్రేషన్ బారినపడుతున్నట్టు తెలుస్తుం ది.
ఇప్పటి వరకు సుమారు 21 మంది జవాన్లు డీహైడ్రేషన్‌కు గురైనట్టు సమాచారం. కూంబింగ్‌కు ఎండ తాకిడి సమ స్యగా మారడంతో భద్రతా బలగాలు హెలికాప్టర్లు, డ్రోన్ల సహాయంతో మావోయిస్టు ఉన్న స్థావరాలను గుర్తించి బాంబుల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని ఉసురు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం 7 గంటల నుంచే వైమానిక దళానికి చెందిన నాలుగు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. దండకారణ్యం నుంచి భారీ శబ్దాలు, తుపాకుల మోతలతో కర్రెగుట్ట పరిసరాల్లోని గిరిజన ప్రజలు బిక్కుబ్కిక్కుమంటూ గడుపుతున్నారు.
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా జరుగుతున్న కూంబింగ్‌లో భద్రతా దళాలు శని వారం భారీ విజయాన్ని సాధించినట్టు తెలుస్తుంది. మావోయిస్టులకు సంబంధించిన రహస్య స్థావరల్లో ఒకదాని వద్దకు భద్రతా దళాలు చేరుకున్నట్టు సమాచారం. అయితే, అక్కడికి భద్రతా బలగాలు చేరుకునే సమయానికే మావోయిస్టులు తమ స్థావరాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది.
తాము గుర్తించిన స్థావరం వద్ద ఉన్న ఆనవాళ్లను బట్టి అక్కడ సుమారు వెయ్యి మందికిపైగా మావోయిస్టులు చాలా రోజులపాటు ఆశ్రయం పొంది ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు కర్రెగుట్టపై మావోయిస్టుల స్థావరాలన్నింటినీ గుర్తించే వరకు ఈ ఆపరేషన్ కొనసాగించాలని ప్రభుత్వంతోపాటు భద్రతా దళాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.