calender_icon.png 21 January, 2025 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌కౌంటర్‌లో 16 మంది నక్సల్స్ మృతి

21-01-2025 03:14:06 PM

ఛత్తీస్‌గఢ్,(విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో సంయుక్త భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య రెండ్రోజులుగా కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో మొత్తం 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో రెండు రోజులుగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కాల్పులు జరిగిన ప్రాంతంలో ఇప్పటివరకు 16 మృతదేహాలు లభించయాన్ని అధికారులు వెల్లడించారు. చనిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని, ఇద్దరు మహిళలు సోనాబేడ-ధరంబంధ కమిటీకి చెందినవారిగా గుర్తించారు.

ఎదురుకాల్పుల్లో ఎక్కువ మంది మావోయిస్టులు గాయపడగా, పలువురు మావోయిస్టు కీలకనేతలు మృతి చెందినట్లు సమాచారం. మృతి చెందిన మావోయిస్టు కీలకనేత చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి చిత్తూరు వాసి అని, కేంద్రకమిటీ సభ్యుడు చలపతిపై గతంలో రూ.కోటి రివార్డు ప్రకటించారు. చలపతితో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డూ కూడా మృతి చెందారు. నౌపాడ, గరియాబంద్ జిల్లాల్లో నిన్నటి నుంచి భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.  కూంబింగ్ లో గరియాబంద్ డీఆర్జీ, ఒడిశా ఎస్వోజీ దళాలతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది, 207 కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా), ఒడిశా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పాల్గొన్నాయి.