బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో సోమవారం నక్సల్స్ వాహనాన్ని పేల్చివేసిన ఘటనలో జిల్లా రిజర్వ్ గార్డ్స్ (District Reserve Guard)కి చెందిన ఎనిమిది మంది జవాన్లు, ఓ సివిల్ డ్రైవర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. జవాన్ల వెళ్తున్న వాహనాన్ని మావోయిస్టులు ఐఈడీతోతో పేల్చారు. యాంటీ నక్సలైట్ ఆపరేషన్ అనంతరం భద్రతా సిబ్బంది తమ స్కార్పియో వాహనంలో తిరిగి వస్తుండగా కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేలి గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగిందని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (inspector general of police) సుందర్‌రాజ్ తెలిపారు. గత రెండేళ్లలో భద్రతా సిబ్బందిపై నక్సలైట్లు జరిపిన అతిపెద్ద దాడి ఇదేనని ఓ అధికారి తెలిపారు. ఏప్రిల్ 26, 2023 న, పొరుగున ఉన్న దంతెవాడ జిల్లాలో భద్రతా సిబ్బందిని తీసుకువెళుతున్న కాన్వాయ్‌లో భాగమైన నక్సల్స్ వారి వాహనాన్ని పేల్చివేయడంతో పది మంది పోలీసు సిబ్బంది, ఒక పౌర డ్రైవర్ మరణించిన విషయం తెలిసిందే. పేలుడు ఘటనను సస్తర్ ఐజీ ధ్రృవీకరించారు.