calender_icon.png 29 December, 2024 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైనికులపై నక్సల్స్ దాడి

03-11-2024 11:16:31 AM

తీవ్రంగా గాయపడిన ఇద్దరు సైనికులు 

చర్ల: తెలంగాణ -చతిస్గడ్ రాష్ట్రాల సరిహద్దు  ప్రాంతమైన సుక్మా జిల్లా జాగరగుండ వారాంతపు సంతలో విధులు నిర్వహిస్తున్న సైనికులపై మావోయిస్టు నక్సల్స్ మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో విధుల్లో ఉన్న ఇద్దరు సైనికులు తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడి సైనికులను జాగరగుండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందున్నారు. ఒక్కసారిగా తుపాకుల మోత మోగడంతో మార్కెట్లో గందరగోళం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. కాల్పులు జరిగిన విషయాన్ని ఆ జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ధ్రువీకరించారు.