ఛత్తీస్‌గఢ్, అక్టోబర్ 19: ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పైఊర్ జిల్లాలోని అబుజ్‌మద్‌లోని మొహందీ అటవీ ప్రాంతంలో నక్సల్స్ మందుపాతరకు పాల్పడ్డారు. ఈ పేలుడులో ఇద్దరు ఐటీబీపీ( జవాన్లు వీరమరణం పొందగా మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఐటీబీపీ జవాన్లు సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా ఉమ్మడి నారాయణపూర్ జిల్లాలోని ఓర్చా, మొండి ఎరత్‌బట్టి నుంచి ధుర్బేరాకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో కోడ్లియర్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నక్సల్స్ మందుపాతర పేల్చారు.
ఇందులో నలుగురు సైనికులు గాయపడగా.. ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూ తరలించగా అక్కడ వారు చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరు గాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతులను మహారాష్ట్రలోని సతారాకు చెందిన అమర్ పన్వర్(36), ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన రాజేష్ (36)గా గుర్తించారు.
*మందుపాతర పేలి ఇద్దరు జవాన్ల వీరమరణం
*ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్ జిల్లాలో ఘటన