calender_icon.png 20 April, 2025 | 4:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడవిని వీడి.. జనజీవనం వైపు పయనం

08-04-2025 12:00:00 AM

దంతెవాడలో 26 మంది మావోయిస్టులు లొంగుబాటు

చర్ల, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): చర్ల మడలం సరిహద్దు రాష్ట్రమైన చతీష్‌గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా దంతెవాడలో సోమవారం 26మంది నిషేదిత మావోయిస్టు లు లొంగిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొంటున్న కఠిన వైఖరికి ఉక్కిరి బిక్కిరి అవుతున్న మావోయిస్టులు జనజీవన స్రవంతివైపు అడుగులేస్తున్నారు. ఆపరేషన్ కగార్ ప్రభావంతో అధిక సంఖ్యలో మావోయిస్టులు ఆయుధాలు వదిలీ అడవినీ వీడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం దంతెవాడలో 26మంది లొంగిపోయారు.

వారిలో రూ 4.5 లక్షల రివార్డు కలిగిన ముగ్గురు మావోయిస్టులు ఉన్నారు. వీరం తా ఆయుదాలతో సహా పోలీసులకు లొంగిపోయారు. వీరంతా రోడ్లుతవ్వి బాంబులు అమర్చడం, బ్యానర్, పోస్టర్లు అంటించే సంఘటనల్లో పాల్గొన్నవారే. హోమ్‌కమింగ్ అభియాన్ పిలుపుతో ఇప్పటి వరకు 953 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా జనజీవన స్రవంతిలో కలిసి జీవ నం సాగిస్తున్నారు. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాటుతో ఆపార్టీ  దెబ్బ మీద దెబ్బ తగులుతోందని చెప్పవచ్చు.