calender_icon.png 11 January, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాలో నక్సలిజం అంతమవుతోంది

02-01-2025 03:07:35 AM

  1. ఆ రోజు దగ్గరలోనే ఉంది
  2. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
  3. సీఎం సమక్షంలో లొంగిపోయిన అగ్రనేత భార్య

గడ్చిరోలి, జనవరి 1: మహారాష్ట్రలో త్వరలో నక్సలిజం అంతం అవుతుందని, అనేక మంది మావోలు ఆయుధాలు వీడుతున్నారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. గడ్చిరోలి జిల్లాను మావోయిస్టు రహితంగా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

గడ్చిరోలి ప్రభుత్వ ప్రాధాన్యతా క్రమంలో మొదటి జిల్లాగా ఉందని ఆయన తెలిపారు. గడ్చిరోలి ప్రాంతంలో ఆయన 32 కిలోమీటర్ల రోడ్‌తో పాటు బస్సు సర్వీసులను కూడా ప్రారంభించారు. ఈ రోడ్ లింక్ మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లను కలుపుతుందని తెలిపారు. 

రిక్రూట్‌మెంట్ ఆగిపోయింది..

మహారాష్ట్రలో కొత్తగా నక్సల్స్ రిక్రూట్‌మెంట్ ఆగిపోయిందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. చాలా మంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారని, మరికొంత మందిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. 38 ఏండ్ల పాటు నక్సలైట్‌గా వివిధ స్థాయిల్లో పని చేసిన తారక్క సీఎం ఎదుట లొంగిపోయారు.

నక్సలిజాన్ని అంతమొందించేం దుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని తెలిపారు. మహారాష్ట్రలోని సీ మోడల్‌ను వేరే రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని ఆయన తెలిపారు.