బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నవోదయ ఆరో తరగతి నందు ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి యదుసింహా రాజు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. మొత్తం విద్యార్థులు 171మంది విద్యార్థులకు 140 మంది విద్యార్థులు హాజరు కాగా, 31 మంది గైర్హాజరయ్యారని ఆయన తెలియజేశారు. పరీక్ష ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:30 పరీక్ష నిర్వహించారు. ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులు ఉదయం 10 గంటలకు పరీక్షా కేంద్రంకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రంలో 8 మంది ఇన్విజిలేటర్లు, చీప్ సూపర్డెంట్ గా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రవిలాదేవి వ్యవహరించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పరీక్షా కేంద్రంలో మౌలిక వసతులు ఏర్పాటు చేశారు.పరీక్షా కేంద్రం వద్ద ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేశారు.