calender_icon.png 18 January, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవోదయ ఎంట్రన్స్ పరీక్ష ఏర్పాట్లు పూర్తి

17-01-2025 11:25:31 PM

కోదాడ (విజయక్రాంతి): ఈ నెల 18న ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు నవోదయ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్ష 2025 జరుగుతుందని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల కోదాడ యందు పరీక్షలు నిర్వహణ చీఫ్ సూపర్డెంట్ గుడి బోయిన రాజు, సెంటర్ లెవెల్ అబ్జర్వర్ డి మార్కండేయ శుక్రవారం నాడు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఇన్విజిలేటర్స్ శిక్షణ సమావేశం నిర్వహించి పరీక్ష నిర్వహణ సూచన సలహాలు వివరించినారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ తో సెంటర్ నకు ఉదయం 10 గంటల వరకు చేరుకోవాలని తెలియజేశారు. కోదాడలో రెండు సెంటర్లలో బాలికల ఉన్నత పాఠశాల యందు 218 మంది, బాలుర ఉన్నత పాఠశాల యందు 170 విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చలకుర్తి నందు నవోదయ పాఠశాల ఉన్నట్లు తెలియజేశారు.