calender_icon.png 22 April, 2025 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమ్జెన్ ఇండియా ఎండీగా నవీన్ గుళ్లపల్లి

12-12-2024 01:46:58 AM

హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): ఆమ్జెన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా నవీన్ గుళ్లపల్లిని నియమిస్తున్నట్టు ఆ సంస్థ సీఈవో సోమ్ చటోపాధ్యాయ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆవిష్కరణలను వేగవంతం చేయడం, సంస్థ అంతర్జాతీయ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో తమ సంస్థ కీలకంగా వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. నవీన్ వ్యూహాత్మక నాయకత్వం కొత్త విజయానికి దారి తీస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచస్థాయి పనితీరు ఆవిష్కరణలు, సాంకేతిక ఆధారిత పరివర్తనను అందించేందుకు ఆమ్జెన్‌కు అవకాశం అందిస్తుందని నవీన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యా ప్తంగా రోగులకు సేవచేసే అవకాశం రావ డం గర్వకారణమని ఆయన స్పష్టం చేశారు.