02-04-2025 01:12:44 AM
హుజూర్ నగర్, ఏప్రిల్ 1: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమి షన్ ఇటీవల ప్రకటించిన గ్రూప్ వన్ ఫలితాల్లో హుజూర్ నగర్ పట్టణానికి చెందిన యరగాని నవీన్ గౌడ్ 472 మార్కులతో 210 ర్యాంక్ సాధించి,ప్రతిభ కనబరిచాడు. చిన్న ప్పటి నుంచి చదువుల్లో చురుకుగా ఉండే నవీన్ గ్రూప్ వన్ లో ఉద్యోగం సాధించడం పట్ల తల్లిదండ్రులు హుజూర్ నగర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ యరగాని గురవయ్య, జయలక్ష్మి మిత్రులు లు హర్షం వ్యక్తం చేశారు.
నవీన్ ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు హుజూర్ నగర్ పట్టణంలో,8 నుంచి 10 వరకు నాగార్జునసాగర్ గురుకుల పాఠశాలలో, ఇంటర్ విజయవాడలో, ఐఐటి ముంబైలోవిద్యనభ్యసించాడు. గ్రూప్-1లో ఉద్యోగం సాధించడం పట్ల బంధు మిత్రులు,పట్టణ ప్ర ముఖులు నవీన్ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో నవీ న్ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.