22-04-2025 12:00:00 AM
నవీన్‌చంద్ర కథానాయకుడిగా నటిస్తున్న బైలింగ్వల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవెన్’. దర్శకుడు సుందర్ సీ వద్ద ‘కలకలప్పు2’, ‘వంద రాజవతాన్ వరువేవ్’ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మత్‌ఖాన్, రేయాహరి నిర్మించా రు. ఇందులో రేయా హరి కథానాయికగా నటిస్తుండగా, అభిరామి, రవివర్మ, కిరీటి దామరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మే 16న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తీక్ అశోకన్; సంగీతం: డీ ఇమాన్; ఎడిటర్: శ్రీకాంత్ ఎన్‌బీ.