1000 కుటుంబాలకువంట పాత్రలు ,దుప్పట్లు పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం, విజయక్రాంతి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం పట్టణం అతలా కుతలమై వేల కుటుంబాలు నిరాశ్రయులైన విషయం విధితమే. ఖమ్మం వరద బాధితులకు కుటుంబాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని నవభారత్ లోని నవ లిమిటెడ్ సిఎస్ఆర్ పాలసీలో భాగంగా సామాజిక బాధ్యత తో మున్నేరు పరివాహక ప్రాంతంలోని 1000 కుటుంబాలకు వంట పాత్రలు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్లు నవ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ లింగం శరత్ బాబు తెలిపారు. బుధవారం రెండు వాహనాల్లో సామాగ్రిని ఖమ్మం తరలించి బాధితులకు అందజేయనున్నట్లు చెప్పారు. జెండా ఊపి వాహనాలను ఖమ్మం తరలించారు.ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ఎంజీఎం ప్రసాద్, వై శ్రీనివాస్, సురేష్ చంద్ర, బి రామారావు, రత్న కిషోర్ తదితరులు పాల్గొన్నారు.