స్వియాటెక్‌తో పోరుకు సిద్ధం ఆస్ట్రేలియన్ ఓపెన్
- స్వితోలినా, మాడిసన్ కీస్ కూడా
- సిన్నర్, అలెక్స్ మినార్‌ల జోరు
మెల్‌బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ చివరి దశకు చేరుకుంది. సోమవారంతో నాలుగో రౌండ్ పూర్తవ్వగా నేటి నుంచి నాకౌట్ దశకు తెరలేవనుంది. మహిళల సింగిల్స్‌లో ఆదివారం సబలెంక, గాఫ్, బడోసా, అనస్తాసియా క్వార్టర్స్ చేరగా.. సోమవారం ప్రపంచ రెండో ర్యాంకర్ స్వియాటెక్, ఎమ్మా నవారో, స్వితోలినా, మాడిసన్ కీస్‌లు ప్రిక్వార్టర్స్‌లో విజయాలు సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.
సింగిల్స్ ప్రిక్వార్టర్స్ తొలి మ్యాచ్‌లో స్వియాటెక్ (పోలండ్) 6 6 జర్మనీకి చెందిన అన్‌సీడెడ్ ఇవా లిస్‌పై సునాయాస విజయాన్ని అందుకుంది. టోర్నీలో స్వియాటెక్ ఇప్పటివరకు ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. 59 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్‌లో ఆదిపత్యం ప్రదర్శించిన స్వియాటెక్.
3 ఏస్‌లతో పాటు 28 విన్నర్లు సంధించింది. ఇక 8వ సీడ్ ఎమ్మా నవారో (అమెరికా) 6 5 7 9వ సీడ్ కసత్‌కినా (రష్యా)పై గెలుపొందింది. 2 గంటల 40 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో నవారో 40 విన్నర్లు కొట్టి ప్రత్యర్థిపై ఆధిపత్య ప్రదర్శించింది. నేడు జరగనున్న క్వార్టర్స్‌లో స్వియాటెక్‌తో నవారో తలపడనుంది. మరో మ్యాచ్‌లో మాడిసన్ కీస్ (అమెరికా) 6 1 6 ఆరో సీడ్ రిబాకినాకు షాకిచ్చింది. మరో మ్యాచ్‌లో ఎలీనా స్వితోలినా 6 6 అన్‌సీడెడ్ కుడెర్‌మెటోవాపై అలవోక విజయాన్ని అందుకుంది.
జొకోవిచ్ x అల్కరాజ్
నేడు జరగనున్న పురుషుల క్వార్టర్స్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌తో స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్ తలపడనున్నాడు. 25వ టైటిల్‌పై కన్నేసిన జొకోవిచ్ అల్కరాజ్‌ను ఎలా నిలువరిస్తాడనేది ఆసక్తికరం. గతేడాది వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్‌పై నెగ్గి అల్కరాజ్ టైటిల్ అందుకున్న సంగతి తెలిసిందే. 2022 నుంచి ఈ ఇద్దరు ఏడుసార్లు తలపడగా.. జొకోవిచ్ 4 సార్లు, అల్కరాజ్ మూడుసార్లు విజయాలు అందుకున్నారు. మరో క్వార్టర్స్‌లో జ్వెరెవ్, పాల్ తలపడనున్నారు.
ఎదురులేని సిన్నర్
పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ జానిక్ సిన్నర్ తన జోరును ప్రదర్శిస్తున్నాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సిన్నర్ 6 3 6 6 హోల్గర్ రూనే (డెన్మార్క్)పై ఉత్కంఠ విజయాన్ని అందుకున్నాడు.
మరో మ్యాచ్‌లో 8వ సీడ్ అలెక్స్ మినార్ (ఆస్ట్రేలియా) 6 7 (7/5), 6 అలెక్స్ మిచెల్‌సన్ (అమెరికా)పై విజయాన్ని నమోదు చేసుకున్నాడు. నేడు క్వార్టర్స్‌లో సిన్నర్‌తో అలెక్స్ మినార్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో మోన్‌ఫిల్స్‌పై షెల్టన్, టియెన్‌పై సొయంగో విజయాలు సాధించి క్వార్టర్స్‌లో అడుగపెట్టారు.